వరుణ్ తేజ్ స్పేస్ జర్నీ బిగిన్ అయింది

Friday,May 11,2018 - 04:09 by Z_CLU

వరుణ్ తేజ్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ స్పేస్ సెట్ వేశారు. రాకెట్స్ , శాటిలైట్స్  తో కంప్లీట్ గా ఇస్రో ని తలపించేలా ఉన్న ఈ సెట్ లో ఈ రోజు నుండి ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ఇప్పటికే స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి తో పాటు అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు, క్రిష్ సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.