పెళ్లి రూమర్స్ పై స్పందించిన హీరోయిన్

Tuesday,July 05,2022 - 03:18 by Z_CLU

Lavanya Tripathi reacts to her Love Marriage rumours

స్టార్ హీరోయిన్స్ పై మీడియాలో పెళ్లి రూమర్స్ రావడం కామనే. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీద కూడా పెళ్లి రూమర్ ఒకటి చక్కర్లు కొట్టింది. ఫలానా హీరోని లావణ్య లవ్ మ్యారేజ్ చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త పుట్టింది. రెండు మూడు రోజులు లావణ్య పెళ్లి న్యూస్ బాగానే చక్కర్లు కొట్టింది కూడా. అయితే తాజాగా ఈ న్యూస్ పై స్పందిస్తూ తనపై వస్తున్న పెళ్లి రూమర్స్ ని ఖండించింది లావణ్య.

ఇటివలే ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చింది లావణ్య. అక్కడ అమ్మడికి మీడియా నుండి పెళ్లి న్యూస్ పై ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే అలాంటిదేం లేదని ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పుకుంది. ఇక తన పెళ్లిపై చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ రూమర్లె అంటూ స్పందించింది. తన చేతికి ఉన్న రింగ్ చూపిస్తూ ఇది ఎవరూ తొడగలేదని, తనే కొనుక్కున్నానని చెప్పుకుంది.

లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ లో నటించిన ‘హ్యాపీ బర్త్ డే’ ఈ నెల 8న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమాతో హీరోయిన్ సక్సెస్ అందుకుంటానని కాన్ఫిడెంట్ గా చెప్పుకుంది. మరి ఈ సినిమాతో లావణ్య ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics