'నేల టికెట్' జ్యూక్ బాక్స్ రివ్యూ

Friday,May 11,2018 - 01:13 by Z_CLU

రవితేజ ‘నేల టికెట్’ సాంగ్స్ రిలీజయ్యాయి. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. నిన్న జరిగిన ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వడం తో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాలో సిచ్యువేషన్ ని బట్టి ఉండబోయే 6 సాంగ్స్ తో రిలీజైన ఈ సినిమా జ్యూక్ బాక్స్, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి.

ఓ సారి ట్రై చెయ్..: సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేసే సాంగ్. మన చుట్టూరా ఉన్న మనుషులే కాదు, గాలి, వాన, నీరు కూడా మన చుట్టాలే అనే మీనింగ్ తో ఉన్న ఈ సాంగ్ ని మల్లికార్జున్ పాడాడు. భాస్కరభట్ల ఈ సినిమాకి లిరిక్స్ రాశాడు.

బిజిలి : రవితేజ, మాళవిక కాంబినేషన్ లో ఉండబోయే మాస్ సాంగ్. వీడియో లో ఇన్సర్ట్ చేసిన స్టిల్స్ ని బట్టి కలర్ ఫుల్ కాన్వాస్ పై, మాస్ మహారాజ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయబోతుంది ఈ సాంగ్. పృథ్వీచంద్ర, జనని సంజని కలిసి పాడిన ఈ సాంగ్ కి చైతన్య పింగళి లిరిక్స్ రాశాడు.

లవ్ యు లవ్ యు : శ్రీ కృష్ణ, రమ్య బెహరా కలిసి పాడిన మోస్ట్ మెలోడియస్ సాంగ్. లిరిక్స్ ని బట్టి  హీరో తన మనసులోని ఫీలింగ్స్ ని హీరోయిన్ కి ఎక్స్ ప్రెస్ చేసే సిచ్యువేషన్ లో ఉండబోయే సాంగ్ అని తెలుస్తుంది. చైతన్య పింగళి ఈ సినిమాకి లిరిక్స్ రాశాడు.

నేల టికెట్ : రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోయే మాస్ డ్యూయెట్. సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా గెస్ చేయడం కష్టం కానీ, ఫ్యాన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని మైండ్ లో పెట్టుకుని కంపోజ్ చేసుకున్న సాంగ్ అని తెలుస్తుంది. సింహ, మధుప్రియ కలిసి పాడిన ఈ సాంగ్ మాస్ లో ఇప్పటికే రిజిస్టర్ అయిపోయింది.

చుట్టూ జనం : సినిమా మెయిన్ కాన్సెప్ట్ ని ఎలివేట్ చేసే సాంగ్. “జనమంతా చుట్టూ ఉంటే ఆ మధ్యన మనమే ఉంటే మనకన్నా మారాజెవడూ లేదంతే..” అంటూ సిచ్యువేషనల్ ఉండబోయే ఈ సాంగ్ ని విజయ్ ఏసుదాస్ పాడాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశాడు.

నమస్తే : సినిమాలో హీరో గొప్పతనం తెలుసుకుని, తను కావాలనుకునే మనుషులు… హీరో కోసం తరలి వచ్చే సందర్భంలో ఉండబోయే సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్ ని డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. PVSN రోహిత్ పాడిన ఈ సాంగ్ ని సుద్దాల అశోక్ తేజ రాశాడు.