Puli Meka – 200 Million Viewing Minutes, The highest-ever watched web series in ZEE5
⇒ జీ 5లో 200 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పులి మేక’
⇒ జీ 5లో ఎక్కువమంది చూసిన వెబ్ సిరీస్ ఇదే
⇒ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పులి మేక’కు అమేజింగ్ రెస్పాన్స్
వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్‌లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది జీ5. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇలా ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది జీ5. తాజాగా విడుదలైన పులి-మేకతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించిన పులి మేక ఒరిజినల్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఇప్పటివరకు 200 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించటం విశేషం. ఇదొక రికార్డ్.
పులి మేక సిరీస్‌లో ప్రారంభం నుంచి చివరకు ఉండే ట్విస్టులు, టర్నులను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. కిరణ్ ప్రభ అనే సిన్సియర్ అండ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకునే వ్యక్తిగా ఆమె తనదైన నటనతో రోలర్ కోస్టర్‌లాంటి కథను ముందుకు తీసుకెళ్లింది. రీసెంట్ గా పులి-మేక మేజర్ సీక్రెట్ ను నితిన్ చెప్పయడంతో, ఈ సిరీస్ పై వ్యూవర్స్ లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

స్టోరీ లైన్, ట్విస్టులు, కథలోని టెన్షన్, అంతర్లీనంగా ఉండే మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ వేల్యూ, నటీనటుల పెర్ఫామెన్సులు, సాంకేతిక నిపుణుల పని తీరు ఆకట్టుకుంటున్నాయి. ఇక చివరలో సెకండ్ సీజన్‌కు లీడ్ కూడా ఇచ్చారు. దీంతో ఆడియెన్స్ ఎగ్జయిట్‌మెంట్ మరింత పెరిగింది. ఆది సాయికుమార్, గోపరాజు రమణ, సిరి హన్మంత్, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్రతీ పాత్రను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
షో రన్నర్‌గా, రైటర్‌గా కోన వెంకట్ ఓ ప్రణాళిక ప్రకారం పులి మేక కథను రాశారు. ఉదాహరణకు క్లైమాక్స్‌లో ఉండే ముగింపు కోన వెంకట్ ఆలోచన విధానాన్ని చక్కగా ఎలివేట్ చేసింది. కమర్షియల్ ఫార్మేట్‌లో సాగే వైవిధ్యమైన వెబ్ సిరీస్‌గా పులి మేక సాగుతుంది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics