పవన్ కళ్యాణ్ మిషన్ బల్గేరియా

Wednesday,July 19,2017 - 04:44 by Z_CLU

పవన్ కళ్యాణ్ బల్గేరియా షెడ్యూల్ కి రేడే అయింది. నెల రోజుల రెగ్యులర్ షూటింగ్ డిజైన్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ రోజే బల్గేరియా బయలుదేరింది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు.

 

బల్గేరియాలో నెల రోజుల పాటు రెగ్యులర్ గా జరిగే ఈ షెడ్యూల్ లో, పవన్ కళ్యాణ్ ఓ సీక్రెట్ మిషన్ పై పనిచేసే సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని హారిక & హాసిని బ్యానర్ నిర్మిస్తుంది. ఖుష్బూ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి డైరెక్టర్.