వరుణ్ తేజ్ ఇంటర్వ్యూ

Thursday,December 20,2018 - 03:17 by Z_CLU

ఎక్స్ పెరిమెంట్స్ చేసేయాలి అనే ఆలోచన లేదు కానీ, చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కంపల్సరీగా ఉండాలనే రూల్ పెట్టుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ‘అంతరిక్షం’ సినిమాతో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 21 న రిలీజవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ హీరో, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ విషయాలు మీకోసం…

కొత్త అనుభవం

ఏ సినిమా చేసినా ఎంతో కొంత తెలిసిన క్యారెక్టరే ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఇప్పటి వరకు చేయని రోల్, ఎక్కడ రిఫరెన్స్ కూడా చేయని క్యారెక్టర్, అందుకే సెట్స్ పైకి వచ్చే ముందు కొన్ని హాలీవుడ్ సినిమాలు చూశాను. డిఫెరెంట్ గా అనిపించింది.

సంకల్ప్ టైమ్ తీసుకున్నాడు…

సంకల్ప్ ఈ సినిమా లైన్ కూడా చెప్పక ముందే, కొన్ని ఇమేజ్ చూపించాడు. ఆ తరవాత లైన్ చెప్పి, ఈ బ్యాక్ డ్రాప్ లో అనుకుంటున్నా అని చెప్పాడు. ఆ తరవాత స్క్రీన్ ప్లే కి టైమ్ తీసుకున్నాడు. చాలా చేంజెస్ చేసుకున్నాడు, ప్రతిసారి స్క్రిప్ట్ ని బెటర్ చేసుకుంటూనే ఉన్నాడు.

ఆస్ట్రోనాట్ సూట్…

ఆస్ట్రోనాట్ సూట్ వేసుకోవడానికే చాలా టైమ్ పట్టేది. కంప్లీట్ గా మమ్మల్ని ప్యాక్ చేసేది. సూట్, హెల్మెట్ తో పాటు బ్యాక్ ప్యాక్ అన్ని కలిపి దాదాపు 15 నుండి 20 కిలోల బరువు ఉండేది.

 

అందుకే ప్రాక్టీస్…

షూటింగ్ జరిగినన్ని రోజులు మ్యాగ్జిమం తాడుతో కట్టేసి గాల్లో వేలాడుతూనే ఉన్నాం. అందుకే అది అలవాటు పడటానికే చాలా ప్రాక్టీస్ చేశాం. డైరెక్ట్ గా షూటింగ్ కి అంటే ఆ ప్రెజర్ ఫేస్ లో కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని ప్రాబ్లమ్స్ కి ముందే అలవాటు పడ్డాం.

0 గ్రావిటీ కోసం…

సినిమాలో ‘0’ గ్రావిటీ ఎఫెక్ట్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్పెషల్ గా వ్యాక్యూమ్ రూమ్స్ రెంట్ కి తీసుకుని షూట్ చేసుకోవచ్చు. లేకపోతే కొన్ని హాలీవుడ్ సినిమాల్లాగా, ఒక సర్టెన్ హైట్ కి వెళ్ళి అక్కడ షూట్ చేసుకోవచ్చు. కానీ అలా చేయాలంటే బడ్జెట్ రేంజ్ ఈజీగా 400 నుండి 500 కోట్లు దాటుతుంది. మా సినిమా 25 కోట్లు.

అవన్నీ ముందే తెలుసు…

రెగ్యులర్ సినిమాలకైతే మామూలుగా డైలాగ్స్ చూసుకుంటాం, సెట్స్ పై పర్ఫామ్ చేస్తాం కానీ, ఈ సినిమాకి వేరు, రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ కాదు, గాల్లో ఉన్నట్టుగా ఉండాలి, కాళ్ళు చేతులు కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలి, అవన్నీ ముందే ప్రిపేర్ అయ్యా, యాక్టర్ గా నాకు చాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం…

సైంటిస్ట్ కథ…

ఏదో అచీవ్ చేయాలని, దేశం కోసం ఏదైనా సరే చేసేయాలనుకునే సైంటిస్ట్ కథ. దాన్ని స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ప్రెజెంట్ చేసినప్పుడు చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.

వాటిపై ఫోకస్ చేయలేదు…

సైంటిస్ట్ ల మధ్య అభిప్రాయ బేధాలుండొచ్చు, అంత చదువుకుని దేశం కోసం ఏదైనా చేయాలనుకునే గ్రూప్ ఆఫ్ పీపుల్ లో, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉండొచ్చు. కానీ మేం అలాంటి పాయింట్స్ పై ఫోకస్ చేయలేదు. మహా అయితే సినిమాలో ఒక క్యారెక్టర్ అలా ఉంటుంది.

పరిస్థితులే విలన్…

సినిమాలో పర్టికులర్ గా విలన్ అంటూ ఎవరూ ఉండరు. ఇక్కడ పరిస్థితులే విలన్. వాటిని టీమ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఎలా ఫేస్ చేశారు అనేదే ఇక్కడ కాన్ఫ్లిక్ట్.

స్యాటిలైట్స్ వల్లే…  

మన లైఫ్ ఇంత ఈజీ అయిందంటే అది డెఫ్ఫినేట్ గా స్పేస్ రీసర్చ్ వల్లే. ఈ సినిమా తరవాత వాళ్ళపై ఇంకా చాలా రెస్పెక్ట్ వచ్చేసింది.

ఎక్స్ పెరిమెంట్స్ కాదు..

నేనేదో స్పెషల్ గా ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నాను అనైతే అనుకోవట్లేదు కానీ, డెఫ్ఫినెట్ గా నా సినిమాలో ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ కంపల్సరీగా ఉండాలని అనుకుంటా.

రాజీవ్ కి ఎప్పుడూ అదే ఆలోచన…

ప్రొడ్యూసర్ రాజీవ్ కి ఎప్పుడూ ఏదో డిఫెరెంట్ గా చేయాలనే ఆలోచనే ఉంటుంది. సింపుల్ గా సినిమా చేసేసి, డబ్బులు సంపాదించేద్దాం అన్నట్టుగా కాకుండా, ఏం చేసినా ఆయన బ్యానర్ కి వ్యాల్యూ ఆడ్ అవ్వాలి అనుకుంటారు.

లావణ్య క్యారెక్టర్…

లావణ్య సినిమాలో కనిపించేది కాసేపే. కానీ హీరో క్యారెక్టర్ కి బ్యాక్ బోన్ లాంటిది. సినిమాలో టీచర్ గా కనిపిస్తుంది.

నాకు అదితికి మధ్య…

సినిమాలో నా క్యారెక్టర్ కి, అదితి క్యారెక్టర్ కి మధ్య లవ్ ఆంగిల్ ఏం ఉండదు. కానీ ఒకరకమైన అడ్మిరేషన్ ఉంటుంది అంతవరకే. సినిమా మ్యాగ్జిమం ఫోకస్ మిషన్ పైనే ఉంటుంది.