షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’

Monday,October 01,2018 - 04:26 by Z_CLU

వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ షూటింగ్ కంప్లీట్ అయింది. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది టీమ్. డిసెంబర్ 21 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా, ఈ రోజు నుండి ఫుల్ టైమ్ పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టనుంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ‘ఘాజి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ జిబెక్, టోడోర్ లాజరావ్ మరియు రోమన్ పని చేసిన ఈ సినిమా, వరుణ్ తేజ్ కరియర్ లో స్పెషల్ గా నిలిచిపోవడం గ్యారంటీ అంటున్నారు ఫిలిమ్ మేకర్స్. లావణ్య త్రిపాఠి తో పాటు, అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.