డిసెంబర్ 27 నుండి RX100 హీరో కొత్త సినిమా

Thursday,December 20,2018 - 12:03 by Z_CLU

RX 100 హీరో మరింత బిజీ అవుతున్నాడు. RX100 తరవాత ‘హిప్పీ’ సినిమాతో సెట్స్ పైకి వచ్చిన యంగ్ హీరో, అప్పుడే 3వ సినిమాకి కూడా సంతకం చేసేశాడు. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో ఈ నెల 27 నుండి సెట్స్ పైకి రానున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాలో మాస్ హీరోగా కనిపించనున్నాడు కార్తికేయ. ఈ సినిమా స్టోరీలైన్ లాంటి డీటేల్స్ అయితే బయటికి రాలేదు కానీ, దర్శకుడు అర్జున్ జంధ్యాల, తన డెబ్యూ మూవీని బోయపాటి సినిమాలాగే, మాస్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాలో కార్తికేయ సరసన నటించనున్న హీరోయిన్ దగ్గరి నుండి తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, త్వరలో ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ అనౌన్స్ చేస్తారు. జ్ఞాపిక ఎంటర్టైన్ మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.