అదితి రావు హైదరి ఇంటర్వ్యూ

Monday,December 17,2018 - 03:13 by Z_CLU

అదితి రావు హైదరి దృష్టిలో హీరోయిన్ కి ఉన్న డెఫ్ఫినేషనే వేరు. గ్లామరస్ గా కనిపిస్తేనో, జస్ట్ లిప్ స్టిక్ వేసుకున్నంత మాత్రాన హీరోయిన్ అనిపించుకోరు అంటూ, కరియర్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్న అదితి రావు హైదరి, ‘అంతరిక్షం’ సినిమా గురించి మీడియాతో చాలా విషయాలు మాట్లాడింది. అవి మీకోసం…

నో అని చెప్పలేదు కానీ…

సంకల్ప్ రెడ్డి ఎప్పుడైతే ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పాడో చాలా నచ్చింది. కానీ అందులో నా క్యారెక్టర్ వరకు వచ్చేసరికి, అది ఎవరైనా చేసేయొచ్చు. దానికోసం నేనే అవసరం లేదు అని చెప్పాను. అప్పుడు సంకల్ప్ స్క్రిప్ట్ లో ఇంకొన్ని చేంజెస్ చేసి చెప్పాడు.

అందుకని కాదు…

నేనేదో అన్నానని కాదు కానీ స్క్రిప్ట్ కి అవసరం అనిపించింది కాబట్టే సంకల్ప్ స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ చేసుకున్నాడు. కంప్లీట్ గా ఒక కొత్త కథని ప్రెజెంట్ చేస్తున్నాడు.

నా ఫీలింగ్ అదే…

ఆస్ట్రోనాట్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్. అందుకే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు కూడా అంతే రెస్పాన్సిబుల్ గా కనిపించాలి అనేది నా ఫీలింగ్.

చాలా రోజుల ప్రిపరేషన్…

బల్గేరియా నుండి వచ్చిన స్పెషల్ టీమ్ మాకు ట్రైనింగ్ ఇచ్చింది. స్టంట్స్ కూడా చాలా కష్టపడి చేశాం. ఒక్క 5 నిమిషాలకే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందేమో అనిపించేది. నేను జస్ట్ 45 కిలోలు కాబట్టి ఒకరకంగా ఈజీ అయింది.

చాలా గాయపడ్డాను…

ఆస్ట్రోనాట్ హెల్మెట్ చాలా హెవీగా ఉంటుంది. అది పెట్టుకున్న ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒకసారి చాలా సీరియస్ అయింది. 2 రోజులు హాస్పిటలైజ్డ్ అయి, నెక్స్ట్ డే షూటింగ్ కి వచ్చేశాను.

అదే నా క్యారెక్టర్…

సినిమాలో నా రోల్ స్పేస్ రీసర్చ్ సెంటర్ లో ఇంటర్న్. కమ్యూనికేషన్స్ ఎక్స్ పర్ట్ లా కనిపిస్తాను ఈ సినిమాలో. ఆ తరవాత ఆస్ట్రోనాట్ గా ట్రైనింగ్ తీసుకుంటాను.

నా ఎగ్జాక్ట్ రోల్…

నా క్యారెక్టర్ హీరో వరుణ్ తేజ్ పాస్ట్ కి కూడా రిలేట్ అయి ఉంటుంది. ఒక రకంగా కామియో అని కూడా చెప్పొచ్చు.

నేను అలా కాదు…

నేను సినిమాలో హీరోయిన్ గానే చేయాలి అనే బ్యారియర్ అస్సలు పెట్టుకోను. నేను చేసేది చిన్న రోల్ అయినా, ఆడియెన్స్ ఆ క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకోవాలి అనుకుంటా.. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అలాంటివే.

బెస్ట్ డైరెక్టర్స్ తో పనిచేస్తే…

మనం పని చేసే టీమ్ ని బట్టే మన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. చేసే పని ఎగ్జైటెడ్ గా ఉంటే, ఎంత కష్టపడ్డ అలసట ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే అంతే ఇంట్రెస్ట్ తో సెట్స్ పైకి వెళ్ళిపోతాం.

ఎందుకో తెలీదు…

‘సమ్మోహనం’ తరవాత ఈ సినిమాకి కూడా నేనే డబ్బింగ్ చెప్దామనుకున్నా. కానీ కుదరలేదు. మేకర్స్ వేరే ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించేశారు.

వరుణ్ తేజ్ తో…

వరుణ్ తేజ్ తో షూటింగ్ టైమ్ లో తప్ప, పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేదు. సెట్ లో తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వేరు. కానీ ప్రిపరేషన్స్ లో ఉన్నప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. హర్ట్ అవ్వకుండా ఎలాంటి టిప్స్ పాటించాలి లాంటివి డిస్కస్ చేసుకునేవాళ్ళం.

అందుకే నవాబ్ చేశా…

‘నవాబ్’ లో నేను చేసిన రోల్ నిజానికి నా కోసం రాసుకున్నది కాదు. కానీ ఒకరోజు మణిరత్నం గారు పిలిచి, చేస్తే చాలెంజింగ్ గా ఉంటుందని చెప్పారు. అంతే చేసేశాను.

నా దృష్టిలో హీరోయిన్ అంటే…

నా దృష్టిలో లిప్ స్టిక్ వేసినంత మాత్రాన హీరోయిన్ కాదు. అంతరిక్షం లో నేను ప్లే చేసింది హీరోయిన్ రోల్ అనే నా ఫీలింగ్. ఆస్ట్రోనాట్ అంటే చిన్న విషయం కాదు. జస్ట్ గ్లామరస్ రోల్స్ చేస్తూ పోతే, ఒకరోజు అందరూ నాతో బోర్ అయిపోతారు. డిఫెరెంట్ రోల్స్ చేసినప్పుడే నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది.