‘అంతరిక్షం’ కి సీక్వెల్ ఉంటుంది – సంకల్ప్ రెడ్డి

Saturday,December 15,2018 - 11:04 by Z_CLU

 ‘అంతరిక్షం’ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇప్పటికే R.S. సిప్పీ, విపుల్ షా ప్రొడక్షన్స్ లో వరసగా 2 సినిమాలు ఫిక్స్ చేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్, బాలీవుడ్  సినిమాకి టైమ్ పట్టేలా ఉంటే, అంతరిక్షం 2 స్టార్ట్ చేసేస్తాను. ఇందులో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తాడు అని చెప్పుకున్నాడు.

బాలీవుడ్ సినిమా అంటే ఆల్మోస్ట్ అందరికీ స్టోరీ చెప్పాలి. ఆ తరవాత హీరోల కాల్షీట్స్ అడ్జెస్ట్ అవ్వడానికి టైమ్ పడుతుందంటే, ఈ లోపు ‘అంతరిక్షం2’ చేసేయడమే బెటర్ అనే ప్లానింగ్ లో ఉన్నాడు సంకల్ప్ రెడ్డి. ఏ సినిమాకైనా కథ రాసుకునేటప్పుడు, పర్టికులర్ హీరోని, మైండ్ లో పెట్టుకుని రాయనని, ఆ టైమ్ కి ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళనే అప్రోచ్ అవుతానని క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్.

‘అంతరిక్షం’ సినిమాకి కూడా కథ రాసుకున్నాకే వరుణ్ తేజ్ ని అప్రోచ్ అయ్యాడు సంకల్ప్ రెడ్డి. వరుణ్ తేజ్ కథ  వినీ వినగానే ఓకె చెప్పడంతో చకచకా సినిమా ప్రాసెస్ బిగిన్ చేసేశాడు.