వరుణ్ తేజ్ – ఒక్క లుక్ తో రెండు సినిమాలు

Tuesday,March 12,2019 - 11:03 by Z_CLU

‘వాల్మీకి’ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు వరుణ్ తేజ్. సాధారణంగా హీరోగా చేస్తేనే డిఫెరెంట్ గా కనిపించాలని ఆరాటపడతాడు ఈ మెగా హీరో. అలాంటింది ఇప్పుడు విలన్ గా చేయాల్సి వచ్చినప్పుడు లుక్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు…? నిజానికి ఈ సినిమా కోసం పెద్దగా ఏమీ ట్రై చెయ్యట్లేదు వరుణ్ తేజ్. కాకపోతే ఈ సినిమాతో పాటే చేయబోతున్న మరో సినిమా కోసం కాస్తంత గట్టిగా ట్రై చేస్తున్నాడు.

హరీష్ శంకర్ ‘వాల్మీకి’ తో పాటు మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు వరుణ్ తేజ్. అదే కిరణ్ కొర్రెపాటి డైరెక్షన్ లో. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా స్టోరీలైన్ లాంటివి ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ, ఇది ఒక చాలెంజింగ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి లాంగ్ బ్యాక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఈ క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యాక కానీ, సెట్స్ పైకి వచ్చే  ప్రసక్తే  లేదని ఫిక్సయి ఉన్నాడట వరుణ్ తేజ్.  100% ప్రొఫెషనల్ బాక్సర్ లా ట్రాన్స్ ఫామ్ అయ్యే వరకు స్ట్రిక్ట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఈ ట్రైనింగ్ ని మల్టీపర్పస్ గా వాడుకోబోతున్నాడు ఈ మెగాహీరో.

ఈ బాక్సర్ లుక్స్ నే ‘వాల్మీకి’ విలన్ రోల్ కి కూడా వాడేయబోతున్నాడు వరుణ్ తేజ్. దీనికి హరీష్ శంకర్ కూడా ఓకె అనేశాడట. ప్రతిసారి  స్టైలిష్ లుక్స్ లో కనిపించడానికి ఎంత ఎగ్జైటెడ్ గా ఉంటాడో, ఈ బాక్సర్ లుక్స్ విషయంలో కూడా అంతే సీరియస్ గా ఉన్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే ఆరున్నర అడుగుల హ్యాండ్ సమ్ హీరో అనిపించుకున్న ఈ మెగా ప్రిన్స్,  ఇప్పుడు మజిల్ మ్యాన్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్నాడు.