వాల్మీకి టీజర్ రెడీ

Tuesday,August 13,2019 - 12:22 by Z_CLU

ఈ సినిమాకు సంబంధించి ప్రీ-లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇప్పుడు అసలైన టీజర్ కూడా రెడీ అయింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ లుక్ తో మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. మరో పాత్రలో తమిళ హీరో అధర్వ మురళి నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతోంది. తెలుగులో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు. కాకపోతే దీన్ని పూర్తిస్థాయి రీమేక్ లా కాకుండా తనదైన మార్పులు చేశాడు దర్శకుడు. గతంలో పవన్ కల్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ అనే రీమేక్ సినిమాకు కూడా ఇలానే చాలా మార్పులు చేసి హిట్ కొట్టాడు హరీష్.