మహేష్-అనిల్ మూవీ.. ఈసారి పంచ్ లైన్ ఏంటి?

Tuesday,March 12,2019 - 12:02 by Z_CLU

అనీల్ రావిపూడి సినిమాలంటేనే హండ్రెండ్ పర్సెంట్ వినోదం. దీనికి తోడు తన ప్రతి సినిమాలో కామెడీగా ఏదో ఒక కొత్త పదప్రయోగం చేయడం అనీల్ కు అలవాటు. అలా చేసిన ప్రయోగాలన్నీ హిట్ అయ్యాయి కూడా. దీంతో ఈసారి మహేష్ సినిమా కోసం అనీల్ కొత్తగా ఏ పంచ్ లైన్ కనిబెట్టబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఎఫ్-2 సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించింది ఈ కామెడీ పంచ్ లైన్. సినిమా ఎంత హిలేరియస్ గా ఉన్నప్పటికీ.. మధ్యమధ్యలో ఈ పంచ్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ మరింత ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ నవ్వారు. అంతేగా.. అంతేగా అనే ఈ పంచ్ లైన్ సినిమాలో అంత క్లిక్ అయింది.

రాజా ది గ్రేట్ లో కూడా ఇలాంటి పంచ్ లైన్ ఉంది. ఇట్స్ లాఫింగ్ టైమ్ అంటూ రవితేజ, శ్రీనివాసరెడ్డి చేసే చిలిపి కామెడీని ఎవరు మరిచిపోగలరు చెప్పండి. ఈ పంచ్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ పడీపడీ నవ్వారు. దీంతోపాటు సినిమాలో ‘జకాస్’ అంటూ 30 ఇయర్స్ పృధ్వి చేసిన కామెడీ కూడా క్లాసిక్ అయింది.

ఎమేజింగ్.. జింగ్ జింగ్  అంటూ సుప్రీమ్ లో వచ్చే మరో కామెడీ లైన్ కూడా హిలేరియస్ గా ఉంటుంది. నీట్ గా సూట్ వేసుకొని దొంగతనాలు చేసే పృధ్వి, ప్రభాస్ శ్రీను ఈ డైలాగ్ ను పాపులర్ చేశారు. సినిమా రిలీజ్ తర్వాత ఈ పంచ్ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తొలి సినిమా పటాస్ లో కూడా ఇలాంటి లైన్ ఉంది. అదే పార్థాయ. భగవద్గీత నుంచి ఈ చిన్న పదాన్ని తీసుకొని అనీల్ రావిపూడి పండించిన కామెడీ టోటల్ సినిమాకే హైలెట్ అయింది. ఇప్పటికీ యూట్యూబ్ లో కామెడీగా ఎవర్నయినా కొట్టే సీన్ వస్తే, బ్యాక్ గ్రౌండ్ లో ఈ ట్యూన్ వాడుతున్నారంటే అది ఎంత పాపులర్ అయిందో అర్థంచేసుకోవచ్చు.

ఇలా తొలి సినిమా నుంచి ఏదో ఒక కామిక్ పంచ్ ను ప్రేక్షకులకు అందిస్తున్న అనీల్ రావిపూడి, మహేష్ మూవీతో ఎలాంటి లైన్ కనిబెడతాడో తెలుసుకోవాలనే ఆసక్తి ఆడియన్స్ లో పెరిగింది.