మాస్ మహారాజ్ సేమ్ స్ట్రాటజీ

Tuesday,March 12,2019 - 10:06 by Z_CLU

మాస్ మహారాజ్ స్పీడ్ మీదున్నాడు. ఎప్పుడు స్టోరీస్ వింటున్నాడు..? ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నాడు లాంటి పజిల్స్ ని పక్కన పెడితే, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ స్ట్రాటజీ నే ఈ ఇయర్ కూడా ఫాలో అవుతున్నాడు. 2018 లో వరసగా టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేసిన రవితేజ, ఈ ఏడాది కూడా మినిమం 3 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయినట్టున్నాడనిపిస్తుంది.

ప్రస్తుతం V.I. ఆనంద్ డైరెక్షన్ లో ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. మాస్ మహారాజ ఇమేజ్ కి తగ్గ టైటిల్ అనిపించుకుంది అనౌన్స్ అయిన రోజే. ప్రస్తుతం ఈ సినిమాని ఫాస్ట్ పేజ్ లో ఫినిష్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమాతో పాటు రవితేజ పేరుకి అటాచ్డ్ గా మరో సినిమా కూడా వినిపిస్తుంది. అదే ‘తేరీ’ రీమేక్.

‘తేరీ’ రీమేక్ అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా రోజుకో న్యూస్ ఈ సినిమా చుట్టూ తిరుగుతూనే ఉంది. దాంతో ఆల్మోస్ట్ ఈ సినిమా కన్ఫమ్ అనే వైబ్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. మిగలిన డీటేల్స్ ఎలాగూ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు తెలిసిపోతాయి.

ఇకపోతే మరొక్క సినిమా… మహా అయితే మార్చి నడుస్తుంది. ఇంకా చాలా రోజులుంది కాబట్టి ఈ లోపు మాస్ మహారాజ్ మరో సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకు వచ్చి ఏడాదికి 3 సినిమాల స్ట్రాటజీని పక్కా ఫాలో అవుతాడని ఫిక్స్ అయి ఉన్నారు ఫ్యాన్స్.