బాక్సర్ గా మారిన వరుణ్ తేజ్.. మూవీ లాంఛ్

Thursday,October 10,2019 - 12:27 by Z_CLU

గద్దలకొండ గణేష్ లో రౌడీషీటర్ గా కనిపించిన వరుణ్ తేజ్, ఇప్పుడు బాక్సర్ గా మారాడు. బాక్సింగ్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ హీరోగా ఓ కొత్త సినిమా ఈరోజు లాంఛ్ అయింది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెట్స్ పైకి వస్తుంది.

ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్. పనిలోపనిగా వెయిట్ కూడా తగ్గాడు. ఈరోజు జరిగిన మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో కాస్త తగ్గినట్టు కనిపించాడు. అల్లు అరవింద్ కొడుకు అల్లు వెంకటేష్ (బాబి) ఈ సినిమా నిర్మాతగా మారుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. గద్దలకొండ గణేష్ తో కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్.. ఈ కొత్త సినిమాతో మరో సక్సెస్ పై కన్నేశాడు. సినిమా టైటిల్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.