Vaishnav Tej Next - లిస్ట్ లో స్టార్ డైరెక్టర్?

Wednesday,July 07,2021 - 07:31 by Z_CLU

‘ఉప్పెన’ తో హీరోగా లాంచ్ అయిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమా సెట్స్ పై ఉండగానే క్రిష్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. రెండో సినిమాతో త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతున్న వైష్ణవ్ తాజాగా గిరీశయ దర్శకత్వంలో మూడో సినిమా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. అయితే ఈ లోపు మరో సినిమాను ఓకె చేసుకున్నాడట వైష్ణవ్.

Akhil in Surender Reddy Direction

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వైష్ణవ్ నాలుగో సినిమా రానుందనే ప్రచారం జరుగుతుంది. ఇటివలే వైష్ణవ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించి #VaishnavTej4 లాక్ చేసుకున్నాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు సురేంద రెడ్డి. సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు మెగా యంగ్ హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకొని దానికి సంబంధించి కూడా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడట.

NIharika_Konidela_Chaitanya_wedding_Vaishnav_Tej

సైరా నరసింహా రెడ్డి తర్వాత ఎవరైనా పెద్ద హీరోతో సురేందర్ రెడ్డి సినిమా చేస్తాడనుకుంటే అఖిల్ తో ఎనౌన్స్ చేసి షాకిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వైష్ణవ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్‘ సినిమా పూర్తయ్యాకే వైష్ణవ్ తేజ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నాడట సురేందర్ రెడ్డి. ఏజెంట్ ని వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు సురేందర్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics