#NTR - లిస్టులో ఆ దర్శకుడు కూడా?

Wednesday,July 07,2021 - 07:42 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ‘RRR‘ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ సినిమాను మొదలు పెట్టనున్న ఎన్టీఆర్ తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. అవును కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో కూడా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

అట్లీ తో ఎన్టీఆర్ కి పరిచయముంది. తన ప్రతీ సినిమాకు తారక్ నుండి కాల్ వస్తుందని ఓ సందర్భంలో చెప్పుకున్నాడు అట్లి. అంతే కాదు ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని అప్పట్లో తెలిపాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనలైజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా అట్లి తారక్ కి ఆన్లైన్ ద్వారా ఒక స్క్రిప్ట్ చెప్పాడని ఫైనల్ నరేషన్ చెప్పాల్సి ఉందని అంటున్నారు.

అయితే తారక్ తో అట్లి ఓ లవ్ స్టోరీ తీయనున్నాడని తెలుస్తుంది. గతంలో అట్లీ తీసిన రాజా రాణి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బెస్ట్ లవ్ స్టోరి అనిపించుకుంది. ఆ సినిమా తరహాలోనే తారక్ తో ఓ మెచ్యూర్ లవ్ స్టోరీ తీస్తాడని టాక్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లో బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కడం ఖాయం. ఈ కాంబో సినిమాపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజు వెయిట్ చేయాల్సిందే.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics