Pawan Rana Movie - షూటింగ్ అప్ డేట్స్

Tuesday,July 06,2021 - 11:57 by Z_CLU

కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆగిపోయిన సినిమాల్లో పవన్ కల్యాణ్ మూవీ కూడా ఉంది. పవన్-రానా హీరోలుగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చాన్నాళ్ల కిందటే ఆగిపోయింది. మధ్యలో పవన్ కల్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. అలా ఆగిపోయిన పవన్-రానా మూవీ మళ్లీ మొదలుకాబోతోంది.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ కు పవన్ కల్యాణ్ కాల్షీట్లు కేటాయించారు. ఈనెల 12 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈసారి పవన్, రానాతో పాటు.. హీరోయిన్ నిత్యామీనన్ కూడా సెట్స్ పైకి రాబోతోంది.

pawan rana movie zeecinemalu

పవన్-రానా మూవీ వర్కింగ్ స్టిల్స్

నిజానికి ఈ సినిమాలో సాయిపల్లవిని అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో ఆ పాత్ర కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. సినిమాలో పవన్ కల్యాణ్ కు భార్యగా కనిపించనుంది నిత్యామీనన్. ఈ షెడ్యూల్ లో నిత్యామీనన్ కు సంబంధించిన సీన్స్ అన్నీ పూర్తిచేయబోతున్నారు.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మూవీలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ షెడ్యూల్ లోనే సినిమా టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics