Director turns Producer - నిర్మాతగా మారిన మరో డైరెక్టర్

Wednesday,September 09,2020 - 12:05 by Z_CLU

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్స్ లో చాలా మంది నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ లోనే నిర్మాతగా మారిన టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తన బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. తాజాగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) కూడా నిర్మాతగా మారాడు. అఖిల్ తో చేయబోయే తదుపరి సినిమాను AK Entertainments బ్యానర్ తో కలిసి నిర్మించబోతున్నాడు సురేందర్.

తన బ్యానర్ పేరు కూడా ఎనౌన్స్ చేసాడు. ‘Surrender 2 Cinema’ అనేది సురేందర్ రెడ్డి కొత్త బ్యానర్.

ఇకపై ఈ బ్యానర్ లో కొత్త దర్శకులకు కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నాడు సురేందర్. తక్కువ బడ్జెట్ తో కాన్సెప్ట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి AKHIL5 తో ఇటు దర్శకుడిగా అటు నిర్మాతగా సురేందర్ రెడ్డి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.