#Agent అఖిల్ నుండి డిఫరెంట్ మూవీ

Thursday,April 08,2021 - 01:37 by Z_CLU

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ నెక్స్ట్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ‘ఏజెంట్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అఖిల్ నుండి ఓ డిఫరెంట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి న్యూ మేకోవ‌ర్ లో డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో గడ్డంతో స్టైలిష్ హెయిర్‌ తో స‌రికొత్త‌గా ఉన్నాడు.  పోస్టర్ లో సిగరెట్ తాగుతున్న అఖిల్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ తనను తాను ల‌వ‌ర్‌బాయ్ నుండి మాచోమేన్‌గా మార్చుకున్నాడు. ఈ సినిమలో ఎన్నడూ చూడని విధంగా స్టైలిష్ అవతార్ లో అఖిల్‌ను ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి ప్రజెంట్ చేయబోతున్నాడు.

 శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈరోజే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కింగ్ నాగార్జున మొదటి షాట్ కి క్లాప్ ఇచ్చి టీంకి బెస్ట్ విషెస్ అందించాడు. AK ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 11 నుండి జరగనుంది. ఇదే ఏడాది డిసెంబర్ లో 24న క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.  అఖిల్ సరసన సాక్షి వైద్య  హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తుండగా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Also Read వకీల్ సాబ్ ఆడియో రివ్యూ

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics