Chiranjeevi - మేనల్లుడికి ''మెగా'' గిఫ్ట్

Thursday,March 11,2021 - 09:46 by Z_CLU

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా సెటిల్ అయిపోయాడు. మొదటి సినిమాకే 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి మెగా స్టామినా చూపించాడు.

తొలి సినిమాకే తన మేనల్లుడు హీరోగా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వడంతో చిరంజీవి ఆనందానికి అవధుల్లేవ్. దీంతో వైష్ణవ్ కు ఓ అందమైన బహుమతి ఇచ్చారు చిరంజీవి. లిమిటెడ్ ఎడిషన్ గా వచ్చిన ఓ కాస్ట్ లీ వాచ్ ను ప్రజెంట్ చేశారు.

మామయ్య అందించిన బహుమతికి వైష్ణవ్ తేజ్ మురిసిపోయాడు. సోషల్ మీడియాలో చిరంజీవికి థ్యాంక్స్
చెప్పాడు.

ప్రస్తుతం ఈ హీరో ఉప్పెన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ నటించిన సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై వైష్ణవ్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.