Geetha Arts లో రెండో సినిమా!

Monday,August 10,2020 - 05:33 by Z_CLU

మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే మెగా మేనల్లుడు రెండో సినిమా పట్టేసాడు. ‘ఉప్పెన’ సినిమాతో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్  తేజ్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే రెండో సినిమాను గీతా ఆర్ట్స్ లో కన్ఫర్మ్ చేసుకున్నాడట Vaishnav Tej. అవును.. GA2 బ్యానర్ పై  వైష్ణవ్ తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నారట అల్లు అరవింద్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కథ రెడీ అవుతుందని సమాచారం. స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే డైరెక్టర్ పేరుతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ లోపు ఎలాగూ ‘Uppena’ రిలీజవుతుంది కనుక వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది.

ఇక సాయి తేజ్ రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కూడా Geetha Arts బ్యానర్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే.