మా తమ్ముడి సినిమాను హిట్ చేయండి

Thursday,September 01,2022 - 02:58 by Z_CLU

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో..  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మళ్లీ ఇలా రావడం అనేది నా అదృష్టం. మళ్లీ వస్తాను అని అనుకోలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ఫ్యామిలీకి అక్క (సుమ) ఎంతో హెల్ప్ చేసింది. ఏరా వైష్ణవ్.. కేతికతో అంత క్లోజా నువ్వు.. గిరీశాయకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. దేవీ గారు ఇంత మంచి పాటలు అందించినందుకు థాంక్స్. టైటిల్ ట్రాక్ నాకు చాలా ఇష్టం. శ్యామ్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను.. మా ప్రసాద్ గారు నాకు మంచి చిత్రాన్ని ఇచ్చారు. సోలో బ్రతుకే సో బెటర్.

కేతిక చాలా అందంగా ఉంది. ఆమెకు ఆల్ ది బెస్ట్. 2021 లక్కీ ఇయర్.. ఉప్పెనతో వైష్ణవ్ హిట్ కొట్టాడు.. వైష్ణవ్‌ను యాక్సెప్ట్ చేశారు.. థాంక్స్ టు ఆడియన్స్. సినిమా హిట్ అవుతదా? బ్లాక్ బస్టర్ అవుతదా? అన్నది నాకు తెలీదు.. మీరు మా తమ్ముడిని యాక్సెప్ట్ చేశారు. అదే నాకు చాలు. వైషూ.. ఫస్ట్ సినిమాలోనే రొమాంటిక్ సాంగ్.. ఇప్పుడు కొత్తగా లేదంటి సాంగ్.. మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా?.. స్టేజ్ మీదకు ఎక్కినా, కింద ఉన్నా కూడా వీడ్ని ఏడిపించడం ఇష్టం.. వీడు నవ్వుతుంటే నాకు ఇష్టం.. అదే నాకు సంతోషం.. అదే మన హ్యాపీనెస్.. మీ అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తోంది.. అదే నా హ్యాపీనెస్. నా తమ్ముడు మంచి యాక్టర్ అని నాకు అనిపిస్తోంది.. సెప్టెంబర్ 2న థియేటర్లకు వెళ్లి మా తమ్ముడి సినిమాను హిట్ చేయండి.

మీ అందరికీ పవర్ స్టార్.. నాకు ఆయన గురువు గారు.. నా గురువు పుట్టిన రోజు.. సినిమా చూడండి.. ఆయన పేరు మీద బర్త్ డే పార్టీ చేసుకోండి.. మన అందరి తరుపున పవర్ స్టార్ గారికి బర్త్ డే విషెస్ చెబుతున్నాను. సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా రిలీజ్ అవుతోంది అందరూ చూడండి’’ అని అన్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics