Chef Chiranjeevi : ఈసారి చేపల కూర

Monday,August 10,2020 - 03:52 by Z_CLU

చిరంజీవి మెగాస్టార్ మాత్రమే కాదు, మంచి చెఫ్ కూడా. ఫ్రీ టైమ్ దొరికితే వంటలు చేయడానికి ఇష్టపడతారు. తాజాగా మరోసారి చెఫ్ అవతారం ఎత్తారు చిరు. ఈసారి ఏకంగా చేపల కూర చేసి ఘుమఘుమలాడించారు.

చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు వేపుడు.. ఈ కర్రీ అంటే చిరంజీవికి చాలా ఇష్టం. అమ్మ అంజనా దేవి ఎప్పుడూ చిరంజీవికి ఈ కూర చేసి పెడుతుంటారు. ఫర్ ఏ ఛేంజ్.. ఈసారి చిరంజీవి ఈ కూర చేసి తల్లికి తినిపించారు.

Chiranjeevi Chef గా మారి స్వయంగా తన చేతులతో ఈ కూర చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ లాక్ డౌన్ టైమ్ లో తల్లి కోసం అప్పుడప్పుడు వంట చేస్తున్నారు చిరు. మొన్నటికిమొన్న దోశలు చేశారు. ఈసారి ఇలా చేపల ఫ్రై చేశారు.