'రంగ రంగ వైభవంగా' బ్యూటిఫుల్ లవ్ స్టోరీ -వైష్ణవ్ తేజ్

Thursday,September 01,2022 - 07:08 by Z_CLU

Ranga Ranga Vaibhavamgaa is a cute love story with family drama says Vaishnav Tej

వైష్ణవ్ తేజ్ -కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగ రంగ వైభవంగా’ రేపే థియేటర్స్ లోకి వస్తూంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బేనర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ , టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

చిన్నతనం నుండి ఇగో తో మాట్లాడుకోకుండా ఉండే ఇద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది ? వారి ప్రేమ పెళ్లిగా  మారిందా.. లేదా ? అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి ఓ మంచి అనుభూతి ఇస్తుందని చెప్తున్నాడు వైష్ణవ్ తేజ్. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో రంగ రంగ వైభవంగా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ డ్రామా అంటూ చెప్పుకుంటున్నాడు వైష్ణవ్.  తెలుగులో ఇలాంటి కథతో సినిమా వచ్చి చాలా రోజులవుతుందని , కథలో ఇగో తో వచ్చే సన్నివేశాలు దాని ద్వారా పుట్టే కామెడీ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నాడు.

రంగ రంగ వైభవంగా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వస్తుంది. దేవి సాంగ్స్ కూడా సూపర్ హిట్టయ్యాయి.  లవ్ సాంగ్స్ తో  ఈ ఆల్బం కి మంచి ఆదరణ లభించింది. టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. సో రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించి సూపర్ హిట్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics