'వైశాఖం' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్

Wednesday,May 10,2017 - 06:44 by Z_CLU

హరీష్‌, అవంతిక జంటగా లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ. రాజు నిర్మిస్తున్న లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘వైశాఖం’. ఆర్‌.జె. సినిమాస్‌ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేసాడు నేచురల్ స్టార్ నాని ..

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “అచ్చ‌మైన తెలుగు టైటిల్‌. టైటిల్ సౌండింగ్ చాలా బావుంది. విన‌గానే పాజిటివ్‌గా అనిపించింది. టైటిల్ విన‌గానే సాఫ్ట్ ల‌వ్ స్టోరీ అనుకున్నాను. కానీ ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ అని ట్రైల‌ర్ చూడ‌గానే తెలిసింది. సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యి జ‌య‌గారికి, బి.ఎ.రాజుగారికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నా. ఇండ‌స్ట్రీలో అంద‌రూ లేడీ డైరెక్ట‌ర్స్‌, జెంట్ డైరెక్ట‌ర్స్ అంటుంటారు కానీ డైరెక్ట‌ర్ ఎవ‌రైనా డైరెక్ట‌రనేది నా అభిప్రాయం.. ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ల‌వ్‌లీ, వైశాఖం చిత్రాల‌కు ఎడిటింగ్ చేశాను. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌దు. ఓ ఉమెన్ డైరెక్ట‌ర్ ఎడిటింగ్ చేయ‌డ‌మ‌నేది చాలా రేర్‌. వైశాఖం అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది అని దర్శకురాలు బి.జయ తెలిపారు..