బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Wednesday,May 10,2017 - 06:08 by Z_CLU

బాహుబలి రిలీజై 12 రోజులు గడుస్తున్నా ఆ సినిమా పట్ల రెండేళ్ళ క్రితం క్రియేట్ అయిన క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. బాలీవుడ్ లో ఒక్క 12 వ రోజే 15. 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి 2 రిలీజైన రోజు నుండి ఇప్పటి వరకు వసూలు చేసిన మొత్తం గ్రాస్ 359.75 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన బాహుబలి 2 ఇంకా బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్ లో పర్ఫాం చేస్తుంది.

విజువల్ వండర్ గా అల్టిమేట్ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఎదురొచ్చిన ప్రతి రికార్డును తిరగరాసేసింది బాహుబలి 2. జస్ట్ తెలుగు స్టేట్స్ లోనే 151.90 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి 2 అటు బాలీవుడ్ తో పాటు ఓవర్ సీస్ లోను సత్తా చాటుతుంది.