ఉగాదికి ఉంగరాల రాంబాబు సందడి

Sunday,March 26,2017 - 04:10 by Z_CLU

సునీల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉంగరాల రాంబాబు. ఈ సినిమా ఉగాదికి సందడి చేయబోతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా టీజర్ ను ఉగాదికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. సునీల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సునీల్ రాకతో ఉగాది హంగామా ఇంకాస్త ఎక్కువైంది. ఇప్పటికే ఉగాదికి మహేష్ బాబు కొత్త సినిమా సందడి చేయనుంది. ఈనెల 29న మహేష్ కొత్త సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. మరోవైపు నాగచైతన్య కూడా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను ఉగాదికే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. వీటితో పాటు నాగార్జున కూడా రాజుగారిగది-2కు సంబంధించి ఉగాదికి ఓ స్టిల్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇక సునీల్ సినిమా విషయానికొస్తే, ఉంగరాల రాంబాబు సినిమాలో మియా జార్జ్ హీరోయిన్ గా నటిస్తోంది. యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఉంగరాల రాంబాబు మూవీని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.