Sunil - ఈసారి మరో అవతారం

Friday,December 04,2020 - 10:29 by Z_CLU

Sunil as Director
ఓ మంచి కమెడియన్. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హీరో. రీసెంట్ గా విలన్ గా కూడా మారాడు. ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ను చూపించబోతున్నాడు సునీల్. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ సీనియర్ నటుడు మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు.

సునీల్ దర్శకత్వం వహించే సినిమాకు సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే సునీల్ తన డైరక్షన్ లో తెరకెక్కించనున్న సినిమాకు ఎలాంటి కథను సిద్దం చేసుకున్నాడు..? ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే దర్శకత్వం వహిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

సునీల్ నుంచి దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ మేటర్ మాత్రం ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది.

నువ్వే కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు సునీల్. ఎన్నో సినిమాలతో సూపర్ హిట్ కమెడియన్ అనిపించుకున్నాడు. తర్వాత అందాలరాముడు సినిమాతో హీరోగా మారాడు. మర్యాదరామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ వైపు షిప్ట్ అయ్యాడు సునీల్. కలర్ ఫొటో, డిస్కోరాజా లాంటి సినిమాల్లో విలన్ గా కూడా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా మారబోతున్నాడట.