కాటమరాయుడిపై సైబర్ క్రైం ఫోకస్

Sunday,March 26,2017 - 03:04 by Z_CLU

స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు పైరసీ భూతం కాచుక్కూర్చుంటుంది. ఎప్పుడు సినిమా విడుదల అవుతుందా, రికార్డు చేసి సోషల్ మీడియా పెట్టేద్దామని చాలామంది ఆకతాయిలు ఎదురుచూస్తుంటారు. కాటమరాయుడు విషయంలో కూడా అదే జరిగింది. పవన్ నటించిన ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఇలా విడుదలైందో లేదో అలా యూబ్యూట్ లో ప్రత్యక్షమైంది.

బిట్లు బిట్లుగా సినిమాను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీనిపై నిర్మాత శరత్ మారర్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ స్వీకరించిన పోలీసులు… కాటమరాయుడు సినిమాను అప్ లోడ్ చేసిన వ్యక్తుల కోసం వెదుకుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పైరసీ దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎక్కువగా విదేశాల నుంచి ఈ అప్ లోడ్స్ జరిగినట్టు గుర్తించిన పోలీసులు.. స్థానికంగా కూడా కొన్ని అనుమానిత  ఐపీలపై దృష్టిపెట్టారు. పవన్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డాలీ దర్శకుడు.