ఒకే రోజు రెండు సినిమాలతో...?

Wednesday,August 10,2016 - 04:50 by Z_CLU

అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చైతు ప్రస్తుతం ‘ప్రేమమ్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం లో సూర్యదేవర నాగవంశీ నిర్మాణం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక చైతు మరో తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం కొన్ని నెలలు గా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. చైతు నటిస్తున్న ప్రేమమ్ చిత్రాన్ని సెప్టెంబర్ 9 న వినాయకచవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు యూనిట్. సరిగ్గా ఇదే రోజున ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా విడుదల చెయ్యాలని భావిస్తున్నాడు దర్శకుడు గౌతమ్ వాసు దేవమీనన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయనే స్వయంగా తెలియజేసారు. ఇక రెండు సినిమాలకు సంబంధించిన మేకర్స్ ఇదే రోజు పక్కాగా ఫిక్స్ అయిపోతే మాత్రం ఒకే రోజు రెండు సినిమాలతో చైతు థియేటర్స్ లో సందడి చేస్తాడన్నమాట.