శుక్రవారం నుండి బాబు హంగామా..

Wednesday,August 10,2016 - 05:24 by Z_CLU

విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం ‘బాబు బంగారం’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకుని సినిమా పై అంచనాలు పెంచేసాయి. ఇక రీసెంట్ సినిమాలలో కనిపించని లుక్ మరియు ఎనర్జీ తో ఈ చిత్రం లో వెంకీ కనిపిస్తూ అలరిస్తాడని అంటున్నారు యూనిట్. మొన్నా మధ్య ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న మారుతి ఈ సినిమాను కూడా అదే రీతిలో ఎంటర్టైనర్ గా రూపొందించాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అన్ని హంగులతో ఈ శుక్రవారం నుండి థియేటర్స్ లో హంగామా చెయ్యడానికి సిద్దమయ్యాడు బాబు. మరి బొబ్బిలి రాజా ఏ రేంజ్ హిట్ అందుకుంటాడా చూడాలి.