నిజం ఒప్పుకున్న నాగార్జున

Monday,October 10,2016 - 03:09 by Z_CLU

తనయుడు నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు నాగార్జున. ఆనందంతో కొడుకును కౌగలించుకోవాలని ఉందంటూ ట్వీట్ కూడా చేశాడు. తన ఆనందాన్ని తాజాగా మీడియాతో పంచుకున్న నాగ్… ప్రేమమ్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను షేర్ చేసుకున్నాడు.

capture

నిజానికి ఈ సినిమాను రీమేక్ చేయొద్దని చైతూకు సూచించాడట నాగ్. సినిమా చాలా స్లోగా ఉందని, పైగా ఈ టైపు కథలు తెలుగు ఆడియన్స్ కు ఎక్కవని డౌట్ పడ్డాడట. కానీ నాగచైతన్య మాత్రం నాగ్ మాట వినలేదట. కేవలం కథ, అందులో ఉన్న ఎమోషన్ పై నమ్మకంతో ప్రేమమ్ రీమేక్ లో నటించాడట. తన అభిప్రాయం తప్పయిందని, చైతూ నమ్మకమే నిజమైందని అంటున్నాడు నాగ్. ఆ విషయంలో చైతూను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు.