తనయుల కోసం..
Sunday,October 09,2016 - 10:29 by Z_CLU
టాలీవుడ్ లో తనయులకు గట్టి పోటీ ఇస్తున్న హీరో ఎవరా? అనగానే టక్కున వినిపించే పేరు అక్కినేని నాగార్జున. ఓ వైపు హీరో గా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న నాగ్ మరో వైపు తనయుల కోసం గెస్ట్ పాత్రలతో కూడా అలరిస్తున్నాడు

ఇటీవలే అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ చిత్రం లో ఓ పాటలో తనయుడి తో కలిసి చిందేసిన కింగ్ తాజాగా చైతు నటించిన ‘ప్రేమమ్’ లో చివరిలో ఓ గెస్ట్ పాత్రలో కనిపించి అక్కినేని ఫాన్స్ ను ఆకట్టుకొని అలరించాడు. అఖిల్ చిత్రంలో అఖిల్ కంటే స్పీడ్ గా డాన్స్ వేసి అలరించిన కింగ్ తాజాగా ప్రేమమ్ లో నాగ చైతన్య కి గ్లామర్, ట్రెండ్ గురించి పాఠాలు చెబుతూ అందరినీ అలరించాడు. ఇలా తనయుల కోసం గెస్ట్ రోల్స్ లో కనిపిస్తూ థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు మన్మధుడు. మరి రాబోయే రోజుల్లో తనయుల కోసం ఇంకెన్ని గెస్ట్ రోల్స్ లో కనిపిస్తాడో చూడాలి.