రారండోయ్ వేడుక చూద్దాం థర్డ్ సాంగ్ రిలీజ్

Tuesday,May 16,2017 - 03:46 by Z_CLU

26 మే న రిలీజ్ కి రెడీ అవుతుంది రారండోయ్ వేడుక చూద్దాం. ఈ లోపు ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా యూనిట్, ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసేసింది. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ వంతు. ఈ సాంగ్ ని మే 17 న రిలీజ్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అల్టిమేట్ ఇమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లోని ‘ భ్రమరాంబ కి నచ్చేశాను’ అనే సాంగ్ ని రేపు 9:30 కి సోషల్ మీడియాలో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. ఇప్పటికే ఆన్ లైన్ లో రిలీజైన రెండు పాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోన్ లో ఉన్నాయి. వీటికి తోడు మూడో పాట రిలీజ్ ని అనౌన్స్ చేసేసరికి సూపర్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.