బుల్లితెరపై మరో సూపర్ సెన్సేషన్

Tuesday,May 16,2017 - 01:40 by Z_CLU

న్యాచురల్ స్టార్ నాని కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘నేను లోకల్’. రీసెంట్ గా 100 రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 21 న జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు టెలీకాస్ట్ అవుతుంది. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు.

సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేసే నాని, ఈ సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయిలా అందరినీ ఈజీగా కనెక్ట్ అవ్వడం సినిమాని సక్సెస్ రూట్ లో నడిపించింది. దానికి తోడు కీర్తి సురేష్ తన ట్రెమండస్ పర్ఫామెన్స్ తో , నానికి పర్ ఫెక్ట్ జోడీ అనిపించుకుంది.

సినిమా రిలీజ్ కి ముందు నుండే ఎట్రాక్ట్ చేసిన DSP సాంగ్స్, ఇప్పటికీ సోషల్ మీడియాలో అదే క్రేజ్ ని మెయిన్ టైన్ చేస్తున్నాయి. హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి తన మ్యాజికల్ ఎసెన్స్ స్ప్రెడ్  చేయడానికి రెడీ అవుతుంది.