Studio Roundup : షూటింగ్ డీటెయిల్స్

Tuesday,December 15,2020 - 05:07 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా పోస్ట్ అయిన సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా సెట్స్ పైకి వచ్చాయి. మరి జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఆ సినిమాల అప్ డేట్స్ మీ కోసం.

Kajal joins Acharya shoot with Gautam

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కోకాపేట్లో వేసిన భారీ సెట్లో ప్రస్తుతం చిరు , కాజల్ పై సాంగ్ షూట్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇస్తున్నాడు.

RRR_movie_alia_bhatt_rajamouli_working_stills

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ప్రస్తుతం అలియా భట్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. DVV ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీత అందిస్తున్నారు.

Rajinikanth-joins-annaatthe-shoot-in-hyderabad

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న ‘Annaatthe’ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో రజిని , నయనతారలపై సన్నివేశాలు తీస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు D.ఇమాన్ మ్యూజిక్ కంపోజర్.

Kothikommachi-shoot-wrapped-up-vegesnasatish-meghamsh-sameer-news

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో మేఘామ్ష్ శ్రీహరి , సమీర్ వేగేశ్న హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ సినిమా ‘కోతి కొమ్మచ్చి‘ షూటింగ్ పూర్తయింది. నవంబర్ 3న అమలాపురంలో మొదలైన షూటింగ్ రాజమండ్రిలో జరిగిన సాంగ్ తో పూర్తయింది. ఒక పాట మినహా టోటల్ షూట్ ను కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు యూనిట్. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యానారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనుప్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయనున్నారు.

నాగ శౌర్య హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NS22 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం హీరో -హీరోయిన్స్ మధ్య వచ్చే ఆఫీస్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు.

gopichand tamanna seetimaarr 3

గోపీచంద్ -సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న ‘సీటిమార్’ సినిమా సాంగ్ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. స్టూడియో లో వేసిన సెట్ లో గోపీచంద్ , తమన్నా లపై మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్ ను షూట్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

SaiRaamShankar-resound-shoot-going-on-ongole

సాయిరామ్ శంక‌ర్ ‘రిసౌండ్’ లాక్‌డౌన్ అనంత‌రం హైద‌రాబాద్‌లో షూటింగ్ పున‌రుద్ధ‌రించి, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌తో పాటు రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.అనే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు.