డైరెక్షన్ కి బ్రేక్ ఇవ్వనున్న యంగ్ హీరో ?

Tuesday,December 15,2020 - 06:31 by Z_CLU

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో రాహుల్ రవీంద్రన్ ఒకడు. తొలుత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేసిన రాహుల్ మొన్నీ మధ్య ఉన్నపళంగా మెగా ఫోన్ పట్టి ‘చిలసౌ’ అనే సినిమా తీశాడు. మొదటి సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోయినా దర్శకుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. రెండో సినిమాకే నాగార్జున ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు.

రాహుల్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా ‘మన్మథుడు 2’ టైటిల్ తో వచ్చిన ఆ సినిమా అందరికీ నిరాశే మిగిల్చింది. దీంతో కొన్ని రోజులు డైరెక్షన్ కి బ్రేక్ ఇవ్వనున్నాడట రాహుల్. అవును ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ లో ఓ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. సినిమాలో నానికి అన్నగా కనిపిస్తాడని సమాచారం. మరి ఈ కుర్ర హీరో మళ్ళీ మెగా ఫోన్ పట్టి మూడో సినిమా చేయడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.