బాలీవుడ్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్స్

Saturday,September 07,2019 - 10:04 by Z_CLU

జస్ట్ టాలీవుడ్ లో నే కాదు బాలీవుడ్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేశారు టాలీవుడ్ డైరెక్టర్స్… జస్ట్ నేటివిటీని మైండ్ లో పెట్టుకుని కథలు రాసుకోవడమే కాదు.. ప్రమోషనల్ స్ట్రాటజీలోను ఎక్కడా తగ్గడం లేదు. అల్టిమేట్ గా 100 కోట్లు వసూలు చేసి.. బాలీవుడ్ రికార్డ్స్ లోకి ఎక్కుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్లు…

రాజమౌళి : ‘బాహుబలి 2’ మొదటి రోజే 100 కోట్లు వసూలు చేసింది. బాహుబలి – ది బిగినింగ్ జెనెరేట్ చేసిన క్యూరియాసిటీ ఈ సినిమా చుట్టూ హెవీ డిమాండ్ ని క్రియేట్ చేసింది. దీంతో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ రికార్డ్స్ లో 100 కోట్లు వసూలు చేసిన టాలీవుడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు రాజమౌళి.

సందీప్ రెడ్డి వంగ : అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ తో ఇది పాసిబుల్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా, బాలీవుడ్ లో ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహం ఉండేది. కానీ వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ ఫస్ట్ షో నుండే సెన్సేషన్ క్రియేట్ చేసింది కబీర్ సింగ్. ఏకంగా 278. 24 కోట్లు వసూలు చేసింది.

సుజీత్ : ‘సాహో’ కి ఓవరాల్ గా మిక్స్డ్  టాక్ వచ్చినా బాలీవుడ్ లో మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం తగ్గడం లేదు. బి-టౌన్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ సుజీత్ ని కూడా 100 కోట్లు వసూలు చేసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో చేర్చింది.

ప్రస్తుతానికైతే బాలీవుడ్ లో వంద కోట్లు కొల్లగొట్టిన టాలీవుడ్ డైరక్టర్లు వీళ్లు మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ లిస్ట్ లోకి ఇంకెంతమంది టాలీవుడ్ డైరక్టర్లు చేరతారో చూడాలి. త్వరలోనే గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు మరి. జెర్సీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.