సెన్సేషనల్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ?

Tuesday,February 18,2020 - 04:35 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ వార్తలతోనే ఎట్రాక్ట్ చేస్తుంటాయి. ఒక వేళ ఆ వార్త నిజమైతే ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవదులుండవు. ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమా వార్త ఫ్యాన్స్ ను అలాగే ఎట్రాక్ట్ చేస్తుంది. రాధా కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా తర్వాత ప్రభాస్ అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయబోతున్నాడనేది ఆ వార్త.

బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ తో వంద కొల్లగొట్టిన దర్శకుల లిస్టులో చేరిన సందీప్ నెక్స్ట్ టీ -సిరీస్ ప్రొడక్షన్ లో హిందీ , తెలుగులో ఓ బైలింగ్వెల్ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత సందీప్ ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ గట్టిగా వినబడుతుంది. ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.