హీరోలు మారిపోతున్నారు

Saturday,September 07,2019 - 11:03 by Z_CLU

ఓ సినిమా సక్సెస్ అయితే ఆ హీరో క్యారెక్టర్ మైండ్ లో ఫిక్సయి పోతుంది. ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఆ స్టార్ హీరోకి కరెక్ట్ గా సెట్ అయిందనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే తమ హీరోని ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా ఆ డైరెక్టర్ అలాగే ప్రెజెంట్ చేశాడనుకుంటారు… కానీ నిజానికి కొన్ని సినిమాలు వరకు వచ్చేసరికి డైరక్టర్స్ ఆ కథలు రాసుకున్నప్పుడు మైండ్ లో పెట్టుకున్న హీరో వేరు… తీరా సెట్స్ పైకి వచ్చిన హీరో వేరు… ఈ మధ్య ఇలాంటి సందర్భాలు టాలీవుడ్ లో చాలా జరిగాయి.

రణరంగం : రీసెంట్ గా రిలీజైన శర్వానంద్ సినిమా. కొత్తగా కనిపించాడు సినిమాలో… ఈ సినిమాతో శర్వా కూడా సిల్వర్ స్క్రీన్ డాన్ అనిపించుకున్నాడు… కానీ నిజానికి ఈ సినిమా చేయాల్సింది శర్వా కాదు.. రవితేజ. మాస్ మహారాజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఈలోపు శర్వాకి కూడా కథ నచ్చడంతో… రవితేజ తప్పుకున్నాడు.

 

రాజా ది గ్రేట్ : అనిల్ రావిపూడి ఈ సినిమాని నిజానికి రవితేజ కోసం అస్సలు రాసుకోలేదు… మాస్ మహారాజ్ సీన్ లోకి ఎంటరయ్యాక… కథ మరింత కలర్ ఫుల్ అయిందని చెప్పుకున్న అనిల్ రావిపూడి… నిజానికి ఈ సినిమా పెన్ను, పేపర్ స్టేజ్ లో ఉన్నపుడు ఇమాజిన్ చేసుకున్న హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

సుకుమార్ సినిమా: ప్రస్తుతం బన్నితో ఫిక్సయిన సినిమా. ఈ సినిమా నిజానికి మహేష్ బాబు తో చేయాలి. కానీ లాస్ట్ మూమెంట్ లో మహేష్ బాబు తప్పుకునేసరికి, స్తైలిష్ స్టార్ సీన్లోకి వచ్చాడు. కథ మొదలు పెట్టినప్పటి నుండి ఈ లెక్కల మాస్టారు మైండ్ లో ఉన్న హీరో మహేష్ బాబునే.. కానీ సినిమా బన్నీ వైపు యూటర్న్ తీసుకునే సరికి… దానికి తగ్గట్టు చిన్న మార్పులు చేసుకుని సెట్స్ పైకి రాబోతున్నాడు సుకుమార్.

ఈ వరసలో అజయ్ భూపతి ‘మహాసముద్రం’ కూడా వస్తుంది. రవితేజతో ఈ సినిమా రేపో మాపో సెట్స్ పైకి వస్తుందన్న మూమెంట్ లో బ్రేక్ పడింది. ఏం జరిగిందన్నది అప్రస్తుతం అయినా.. ఈసారి రవితేజ ప్లేస్ లోకి ఏ హీరో వస్తాడనే క్యూరియాసిటీ అయితే ఆడియెన్స్ లో ఉంది.. చూడాలి మరీ…