Prabhas Sandeep Vanga Movie - అఫీషియల్ ఎనౌన్స్ మెంట్

Thursday,October 07,2021 - 01:11 by Z_CLU

Sandeep Reddy Vanga directs Prabhas in Spirit
వరుసగా భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ పాన్-వరల్డ్ మూవీ రాబోతోంది. దీనికి స్పిరిట్ (SPIRIT) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ (Prabhas) కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం (#Prabhas25) ఇది.

వరుసపెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ హీరో చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-K సినిమాలున్నాయి. వీటిలో సలార్, ఆదిపురుష్ సెట్స్ పై ఉన్నాయి. ప్రాజెక్ట్-K ఇంకా సెట్స్ పైకి రాలేదు. అంతలోనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించి సంచలనం సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్.

sandeep-reddy-vanga-zee-cinemalu

టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్, యూవీ-క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు మాండరిన్ (చైనా), జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ మూవీ (Spirit Movie)ని ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు.

prabhas zeecinemalu

అయితే ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. సలార్, ఆదిపురుష్ సినిమాల్ని ప్రభాస్ కంప్లీట్ చేయాలి. అటు సందీప్ వంగ (Sandeep Reddy Vanga) కూడా రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాను పూర్తిచేయాల్సి ఉంది. ఈ కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వస్తుంది.

prabhas sandeep vanga spirit

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు సందీప్. అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత మహేష్ తో మూవీ చేసేందుకు ప్రయత్నించినా అది వర్కవుట్ కాలేదు. త్వరలోనే అతడు మహేష్ తో సినిమా చేస్తాడని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో, ప్రభాస్ తో మూవీ ఎనౌన్స్ చేసి షాకిచ్చాడు సందీప్ వంగ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics