విజయ్ దేవరకొండ – కొత్త డైరెక్టర్స్

Tuesday,July 23,2019 - 11:02 by Z_CLU

ఏ దర్శకుడి కైనా మొదటి సినిమా అంటే సంవత్సరాల తరబడి కన్న కల… అందుకే ప్రతి సక్సెస్ ఫుల్ దర్శకుడి మొదటి సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. అయితే విజయ్ దేవరకొండ అలాంటి స్పెషల్ సినిమాల హీరో అనిపించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రేంజ్ స్టార్ డమ్ వచ్చిన తరవాత కూడా స్టార్ డైరెక్టర్ లను కాకుండా కొత్త దర్శకులను ప్రిఫర్ చేస్తున్నాడు.

భరత్ కమ్మ : రిలీజ్ కి రెడీగా ఉన్న ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు ‘భరత్ కమ్మ’ కి ఇది మొదటి సినిమానే. యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్నీ కలిసిన ఎంటర్ టైనింగ్ ప్యాకేజ్ లా రెడీ అయిన ‘డియర్ కామ్రేడ్’ తో భరత్ కమ్మ లాంచ్ కాబోతున్నాడు.

రాహుల్ సంక్రిత్యాన్ : ‘ట్యాక్సీవాలా’ సినిమా దర్శకుడు. ఈ సినిమాకి 2014 లో ‘ది ఎండ్’ అనే సినిమా చేసినా, విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ తోనే వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యాడు.

ఆనంద్ శంకర్ : నోటా సినిమా దర్శకుడు . తమిళంలో మహా అయితే 2 సినిమాలు చేశాడు. తెలుగులో మాత్రం ఈ సినిమాతోనే పరిచయం.

సందీప్ రెడ్డి వంగ : ఈ రోజు ఈ దర్శకుడి పేరు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు… అలాగని ‘అర్జున్ రెడ్డి’ కి ముందు కనీసం చిన్న సినిమా చేసినా దాఖలాలు కూడా లేవు. ఇదే మొదటి సినిమా… విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి పై పెట్టుకున్న నమ్మకం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తరుణ్ భాస్కర్ : ‘పెళ్లి చూపులు’ మొదటి సినిమా. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా టాలీవుడ్ లో ఫీల్ గుడ్ సినిమాల సీజన్ ని క్రియేట్ చేసింది. మరోవైపు విజయ్ దేవరకొండని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి తీసుకువచ్చింది.

అల్టిమేట్ గా విజయ్ దేవరకొండ తన కరియర్ లో ‘గీతగోవిందం’ ఒక్కటే కాస్త ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్ తో చేశాడు. ఈ సినిమా సక్సెస్ తరవాత కూడా మళ్ళీ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.