నాగ చైతన్య సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Sunday,October 29,2017 - 01:30 by Z_CLU

త్వరలో మారుతి డైరెక్షన్ లో నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే… హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యూత్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది.

సినిమాలో శైలాజా రెడ్డి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రమ్య కృష్ణ నటించనుందని, చైతూ రమ్య కృష్ణ అల్లుడిగా కనిపిస్తాడని.. ఆల్మోస్ట్ ఈ టైటిల్ ఫిక్స్ సినిమాకు ఫిక్స్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాకు ‘మంచోడు’ అనే టైటిల్ పెట్టనున్నట్లు వచ్చిన వార్తలో నిజం లేదని అసలు ఆ టైటిల్ కి సినిమాకు సంబంధమే లేదని తేల్చి చెప్పిన మారుతి ఇప్పుడు ఈ టైటిల్ పై ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.