ఒకే రోజు మహేష్ - అల్లు అర్జున్ !

Sunday,October 29,2017 - 12:30 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను(వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న మహేష్ బాబు లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నాడు. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో ఏప్రిల్ 27న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సూపర్ స్టార్.. అయితే సరిగ్గా ఇదే రోజు అల్లు అర్జున్ కూడా ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు.

అయితే ముందుగా ఈ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది ‘నా పేరు సూర్య టీం’. కానీ సడెన్ గా మహేష్ సినిమాను ఇదే డేట్ కి అనౌన్స్ చేశారు మేకర్స్. మహేష్ ఈ డేట్ కి వస్తుండడంతో బన్నీ సినిమా పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారంతా.. అయితే లేటెస్ట్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత బన్నీ వాస్.

ముందుగా ప్రకటించినట్లే ఈ సినిమాను ఏప్రిల్ 27 డేట్ కే రిలీజ్ చేయబోతున్నామని అందులో ఎలాంటి మార్పు ఉండదని, అన్ని ఆలోచించి పైగా ఖుషి రిలీజ్ డేట్ కావడంతోనే ఆ డేట్ ని ఫిక్స్ చేసుకున్నామని, సడెన్ గా ఇప్పుడు దానయ్య గారు ఈ డేట్ ని అనౌన్స్ చేయడం కాస్త ఇబ్బంది కలిగించిందని, కానీ కచ్చితంగా ‘నా పేరు సూర్య’ మాత్రం అదే డేట్ కి రిలీజ్ అవుతుందని తెలిపాడు.. సో నిన్నటి వరకూ ఇద్దరు ఒకే రోజు వస్తారా..లేదా అనే డౌట్ కి క్లారిటీ ఇచ్చేసింది నా పేరు సూర్య టీం.