యంగ్ టాలెంట్ తో పవన్...

Wednesday,October 19,2016 - 10:30 by Z_CLU

 కోలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుథ్ జాక్ పాట కొట్టాడు. పవర్ స్టార్ పవన కల్యాణ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కొలవరిడి పాటతో ఆలిండియా లెవెల్లో పాపులర్ అయిన ఈ కుర్ర కంపోజర్ ఇప్పుడు పవన్ సినిమాతో… తెలుగు ఆడియన్స్ ను ఉర్రూతలూగించడానికి రెడీ అయిపోతున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న పవన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరక్టర్ గా సెలక్ట్ అయ్యాడు.

440098-anirudh

ప్రస్తుతం చెర్రీ చేస్తున్న ‘ధృవ’ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల అతడి స్థానంలో హిపాప్ తమీజాను తీసుకున్నారు. అంతకంటే ముందు అ..ఆ సినిమాకు కూడా మ్యూజిక్ కంపోజ్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు అనిరుథ్. ఎట్టకేలకు మరోసారి త్రివిక్రమే.. అనిరుధుకు పిలిచిమరీ అవకాశం ఇచ్చాడు. తనకు పవన్ కల్యాణ్ సినిమా ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని అనిరుథ్ స్వయంగా తమిళ మీడియాకు తెలిపాడు.