చిరంజీవి బర్త్ డే స్పెషల్

Thursday,August 22,2019 - 09:00 by Z_CLU

  • కృషి, పట్టుదల పునాదిరాళ్లుగా మారితే విజయం వెంటపడుతుంది.

  •  స్వయంకృషి అనేది మంత్రమైతే సక్సెస్ వెంటనడుస్తుంది.

  • సాధించాలనే అభిలాష ఉంటే ఉన్నత శిఖరాలు కూడా తలవంచుతాయి.

  • సవాళ్లను ఛాలెంజ్ గా తీసుకుంటే విజేతగా నిలవడం పెద్ద కష్టమేం కాదు.                                                                                                                              వీటన్నింటినీ చేసిచూపించి నిరూపించిన అసమాన్యుడు.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి.

 

నాలుగు అక్షరాలే.. కానీ నాలుగు దిక్కుల చిరంజీవి గురించి తెలియని వారు లేరు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం టాలీవుడ్ కు ఓ గైడ్. మొగల్తూరు అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణమైన కుర్రాడు లక్షలాది జీవితాల్ని ప్రభావితం చేసే స్థాయికి చేరాడంటే అది సాధారణం విషయం కాదు. చరిత్రలో నిలిచిపోయే సత్యం.

ఆయన పేరులోనే హీరోయిజం ఉంది. ఆయనకు అభిమానులకు ప్రేమతో ఇచ్చిన టైటిల్ మెగాస్టార్. ఏ పేరు చెబితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షం కురుస్తుందో.. ఏ పేరు చెబితే తెలుగువాళ్లు విజిల్స్ వేయకుండా ఉండలేరో.. ఎవరి పేరు చెబితే సినీఅభిమాని ఛాతి పొంగుతుందో.. ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి.

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ యాక్టర్, డ్యాన్సర్ లా కుర్రకారు గుండెల్లో జోష్ ని నిద్రలేపిన మెగాస్టార్, మెగా తరంగంలా దూసుకుపోయారు. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలిగిపోతున్న చాలామంది చిరంజీవిని ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న వాళ్ళే. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి టచ్ చేయని జోనర్ లేదు.

స్వయంకృషి, రుద్రవీణ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసినా, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి అల్ట్రా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా, సినిమా ఎలాంటిదైనా మెగా మ్యాజిక్ వర్కవుట్ అవ్వాల్సిందే.

ఇలా చిరంజీవి సృష్టించిన రికార్డుల గురించి చెప్పాలంటే, ఆయన కొట్టిన హిట్ సినిమాల గురించి చర్చించాలంటే పేజీలు సరిపోవు. తెలుగుతెరకు సిసలైన కమర్షియల్ టచ్ ఇచ్చారు మెగాస్టార్. ‘ఖైదీనంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు సైరా అంటున్నారు. 12 ఏళ్ల నుంచి నలుగుతున్న తన డ్రీమ్ ప్రాజెక్టుకు ఓ రూపు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

ఈ పుట్టినరోజుకు మెగాభిమానులతో పాటు అఖిలాంధ్ర ప్రేక్షకులు సైరా టీజర్ తో పండగ చేసుకుంటున్నారు. స్వతంత్ర సమరయోధుడిగా చిరంజీవి నటిస్తున్న ఈ 151వ చిత్రం మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కోరుకుంటూ, చిరంజీవికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.