పవన్ సినిమాలో చిరు గెస్ట్ రోల్..?

Wednesday,October 19,2016 - 12:47 by Z_CLU

మెగాఫ్యాన్స్ కు బిగ్ బ్రేకింగ్ న్యూస్. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు తెరవెనక గ్రౌండ్ వర్క్ జోరుగా సాగుతోంది. ఊహకందని ఈ కాంబినేషన్ ను… కలలో కూడా ఎవరూ ఊహించని ఈ ఎప్పీయరెన్స్ ను దర్శకుడు త్రివిక్రమ్ ఊహించాడు. పవన్ తో తను తీయబోయే సినిమాలో కుదిరితే చిరుతో చిన్న మెరుపు మెరిపించాలనుకుంటున్నాడు.

chiranjeevi-pawan-kalyan-se

ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో పవన్ బిజీగా ఉన్నాడు. ఈ షెడ్యూల్స్ కాస్త కొలిక్కి వచ్చిన వెంటనే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. అప్పటికే చిరంజీవి తన 150వ సినిమాను దాదాపు పూర్తిచేస్తాడు. సో.. పవన్ సినిమాకు ఓ 2 రోజులు కాల్షీట్ ఇవ్వడానికి చిరంజీవికి ఎలాంటి అభ్యతరం ఉండదు. అటు చెర్రీ చేసిన మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇచ్చిన అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి.. పవన్ అడిగితే చిరంజీవి కాదనడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

మరోవైపు తన రీఎంట్రీలో భాగంగా త్రివిక్రమ్ తో కూడా చిరంజీవి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 151వ సినిమాను బోయపాటి శ్రీనుతో అనకుంటున్న మెగాస్టార్… తన 152వ సినిమాను త్రివిక్రమ్ కు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.