Skanda మూడు గంటలు పట్టేది - రామ్

Sunday,August 27,2023 - 11:44 by Z_CLU

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నారు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు  టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్కోర్ చేసిన మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వున్నాయి.  స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నిర్వహించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. స్కంద ప్రీరిలీజ్ ఈవెంట్  కి విచ్చేసిన బాలకృష్ణ గారికి థాంక్స్. ఆయన రాకతోనే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా మెమరబుల్ గా జరిగింది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. త్వరలో ఒక పాట వస్తుంది అది మాములుగా వుండదు. అది వింటే ఈ సినిమా మీటర్ ఏమిటో బాగా అర్ధమౌతుంది. నిర్మాత శ్రీనివాస్ గారు లేకపోతే ఈ సినిమా వుండదు. ఐదేళ్ళ క్రితమే బోయపాటి, మీరు కాంబినేషన్ అయితే అడిపోతుందని చెప్పారు. అది ఈవాళ కుదిరింది.  పవన్ గారికి థాంక్స్. సాయిమంజ్రేకర్ చక్కగా నటించారు. సినిమాకి డేట్స్ ఇస్తే హీరోయిన్ అంటారు. ఒక్క డేట్ సినిమాకి ఇస్తే అది శ్రీలీల అంటారు ( నవ్వుతూ) .తనకి గ్రేట్ ఫ్యూచర్ వుంది. బోయపాటి గారు మొండిగా నమ్మి వెళ్ళిపోతారు. ట్రైలర్ లో చూసిన లుక్ కి మూడు గంటలు పట్టేది. మొదటి రోజు ఏడు గంటలు పక్కనే కూర్చుని ఓపికగా చేయించారు. బాలయ్య గురించి ఒక మాట చెప్పాలి. మాస్ , క్లాస్ , ఫ్యామిలీ, అమ్మాయిలు ..  ఇలా అన్నీ సెక్షన్స్ జై బాలయ్య మంత్రం జపిస్తుంది. బాలయ్య గారి గురించి జైలర్ సినిమాలో పాట పాడుతా. నీ రచ్చ చుసినోడు, నీ అయ్యా విజల్ విన్నవాడు, రేపు నీ కొడుకు మనవడితో డ్యాన్స్ చేయించేవాడు… మూడు జనరేషన్స్ జై బాలయ్య అంటుందంటే.. ఒక నటుడికి అది పెద్ద అచీవ్ మెంట్. ఇంతకంటే మించిన అవార్డ్ వుండదు. నా ఫ్యాన్స్ కి ఒక మాట చెప్పాలి. పులి వేటకి వచ్చింది. షూట్ చేసినప్పుడు అందరికి కెమరా కనిపిస్తుందోమో. నాకు మాత్రం మీరే కనిపిస్తారు. అందుకే వొళ్ళు దగ్గరపెట్టుకొని పని చేస్తా. నా లక్కు మీరే నా కిక్కు మీరే. అందరికీ థాంక్స్. జై బాలయ్య’’  అన్నారు.