వీళ్ళు హీరోలు మాత్రమే కాదు...

Saturday,February 23,2019 - 11:03 by Z_CLU

రానా చంద్రబాబుడిలా అదరగొట్టేశాడు. కథ పెద్దాయనదే అయినా…. హీరో బాలకృష్ణే అయినా… ‘మహానాయకుడు’ సెకండాఫ్ ని లీడ్ చేసింది మాత్రం రానా అంటున్నారంతా. చంద్రబాబు నాయుడిలా రానా పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ దక్కుతుంది. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ని ప్లే చేస్తూ, సినిమాకి ఎసెట్ అనిపించుకున్నాడు రానా. ఈ వరసలో మరికొంతమంది స్టార్స్ ఉన్నారు.

 వరుణ్ తేజ్ : అప్పుడే ఈ డెసిషన్ తీసుకుంటాడని ఎవరూ గెస్ కూడా చేసి ఉండదు. ఓ వైపు లవర్ బాయ్ గా, మరో వైపు ‘F2’ లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో మెస్మరైజ్ చేస్తున్న వరుణ్ తేజ్ కూడా, జిగర్తాండ రీమేక్ లో పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. దీంతో వరుణ్ తేజ్ పర్ఫామెన్స్ స్టాండర్డ్స్ మరింత ఎలివేట్ కానున్నాయి.

కార్తికేయ : జస్ట్ ఒక్క సినిమాతోనే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపోయాడు కార్తికేయ. RX 100 తరవాత ఇమ్మీడియట్ గా సినిమా రిలీజ్ కాకపోయినా, ఫస్ట్ సినిమా తరవాత చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ని ఎంచుకున్నాడు. 2 సినిమాలను సక్సెస్ ఫుల్ గా సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఆ తరవాతే కనీసం ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. నాని, విక్రమ్ ల సినిమాలో విలన్ నటిస్తున్నాడు కార్తికేయ.

అల్లరి నరేష్ : గతంలో ‘వేదం’ లో చేశాడు. తన చుట్టూ ఉన్న ఇమేజ్ కి కంప్లీట్ గా ఆపోజిట్ క్యారెక్టర్. అల్లరి నరేష్ జస్ట్ అల్లరి చేయడమే కాదు, ఏడిపిస్తాడు కూడా అనిపించుకున్నాడు. మళ్ళీ అలాంటి ఎమోషనల్ రోల్ నే ‘మహర్షి’ లో చేస్తున్నాడు ఈ అల్లరోడు. ఈ క్యారెక్టర్ డీటేల్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ, సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అవుతుందని చెప్తున్నారు మేకర్స్.

సైరా : విజయ్ సేతుపతి, సుజిత్ లు కూడా సైరా లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. వీళ్ళు కూడా హీరోలుగా ఓ వైపు బిజీగా ఉంటూనే, మరోవైపు వస్తున్న ప్రతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ‘సైరా’ లో వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ చుట్టూ ఇంట్రెస్టింగ్ వైబ్స్ ఉన్నాయి.

ఈ వరసలో గతంలో శ్రీవిష్ణు, నారా రోహిత్, నవదీప్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి తో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా జస్ట్ హీరో రోల్స్ పై ఫోకస్ పెట్టట్లేదు. ఓ వైపు ఫుల్ టైమ్ హీరోలుగా చేస్తూ, మరో వైపు పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు.